చిరంజీవి అభినందనలతో భావోద్వేగానికి గురైన ఆమిర్ ఖాన్.. వీడియో ఇదిగో!
- విడుదలకు సిద్ధంగా ఉన్న ఆమిర్ ఖాన్ చిత్రం 'లాల్ సింగ్ చద్దా'
- చిరంజీవి కోసం స్పెషల్ ప్రివ్యూ వేసిన ఆమిర్ ఖాన్
- ఆమిర్ ను హత్తుకుని, అభినందించిన చిరంజీవి
ఈ ప్రివ్యూకి నాగార్జున, ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, నాగచైతన్య కూడా హాజరయ్యారు. ఈ సినిమాను వీక్షించిన అనంతరం ఆమిర్ ఖాన్ ను హత్తుకుని చిరంజీవి అభినందించారు. దీంతో, తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమిర్ ఖాన్ కంటతడి పెట్టుకున్నారు. దీనికి సబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది.