ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన మహేశ్-త్రివిక్రమ్.. అధికారిక ప్రకటన!
- ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమా ప్రకటన
- ఆగస్టులో ప్రారంభం కానున్న షూటింగ్
- మహేశ్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే
ఈ సినిమాను శనివారం అధికారం ప్రకటించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని చిత్రం బృందం తెలిపింది. ఆగస్టులో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పింది. 2023 వేసవిలో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది.
ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన ‘మహర్షి’ సినిమా ప్రేక్షకులను అలరించింది. మరోసారి మహేశ్, పూజ హెగ్డే కలిసి నటిస్తుండటంతో తాజా చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించాల్సి ఉంది.