మమ్మల్ని ఉరేస్తారా? జీవిత ఖైదు విధిస్తారా?... కన్హయ్యలాల్ హత్యా నిందితుల ప్రశ్న
- తమకు ఏ శిక్ష పడుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి
- విచారణాధికారులను అడుగుతున్నా నిందితులు
- ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులు
మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను టైలర్ కన్హయ్యలాల్ సమర్థించినందుకు.. రియాజ్ అత్తారీ, గౌస్ మహమ్మద్ జూన్ 28న గొంతు కోసం హత్య చేయడం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది. వీరిద్దరూ ఇప్పుడు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. వారి నుంచి దర్యాప్తు అధికారులు వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వారు ఈ ప్రశ్నను పలు సార్లు అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.