జగన్ సంక్షేమ పథకాల నడి సముద్రంలో చిక్కుకున్నారు.. ఆయనను మీరే ఒడ్డుకు చేర్చాలి: ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి
- భర్తలు వద్దన్నా మహిళలు మాత్రం తమకే ఓట్లేస్తారన్న చక్రపాణి
- పార్టీకి వ్యతిరేకంగా వచ్చే పోస్టులపై అదే స్థాయిలో బదులివ్వాలని కార్యకర్తలకు సూచన
- బీజేపీ విధానాల వల్లే ధరలు పెరిగాయన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి
సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు వస్తే అదే స్థాయిలో మీరు కూడా పోస్టులు పెట్టాలని కార్యకర్తలకు చక్రపాణిరెడ్డి సూచించారు. బీజేపీ విధానాల వల్లే పెట్రోలు, గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగాయని, అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ పార్టీని ఏమీ అనకుండా తమపై విమర్శలు చేస్తున్నాయని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.