మోదీ సుప్రీం యాక్టర్ అంటూ ప్రకాశ్ రాజ్ సెటైర్!
- జస్ట్ ఆస్కింగ్ పేరిట ప్రకాశ్ రాజ్ ట్వీట్లు
- మెదీని సుప్రీం యాక్టర్‌గా, డైరెక్టర్‌గా అభివర్ణిస్తూ తాజాగా సెటైర్
- ప్రధాని పర్యటనకు చెందిన ఓ వీడియోను జత చేసిన నటుడు
ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌కు మోదీకి చెందిన ఓ వీడియో క్లిప్పింగ్‌ను కూడా జత చేశారు. టీవీ9కు చెందిన 22 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ఏదో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న మోదీని తమ కెమెరాల్లో బంధించేందుకు అప్పటికే కెమెరామెన్లు ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉండగా... ఆ కెమెరాల ముందుకు ఓ వ్యక్తి వచ్చి మోదీకి అభివాదం చేసేందుకు యత్నించారు. అయితే ఆ వ్యక్తిని వెనక్కు వెళ్లాలని సూచించిన మోదీ... కెమెరాలకు అతడు దూరంగా జరిగిన తర్వాత ఆ వ్యక్తికి అభివాదం చేస్తూ మోదీ సాగారు.