ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అది వైఎస్సార్ వల్లే: కొండా సురేఖ
- కొండా చిత్రం ప్రమోషన్స్‌లో కొండా సురేఖ
- విజయవాడలో వైఎస్సార్ విగ్రహానికి నివాళి
- వైఎస్ మరణించాక ఆయన కుటుంబ సభ్యులను కలవలేదన్న సురేఖ
ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది వైఎస్సార్ వల్లనేనని కొండా సురేఖ అన్నారు. వైఎస్ ఆశయాలకు అనుగుణంగానే రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఆమె చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో ఎలాంటి విలువలు లేవని, డబ్బే ప్రధానంగా రాజకీయాలు మారిపోయాయన్నారు. ఏ పార్టీ అయినా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే పనిచేయాలని ఆమె అన్నారు. ఏపీలో ఇప్పుడు వేరే ప్రభుత్వం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. తన కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉందని ఆమె చెప్పారు.