థామస్ కప్ డబుల్స్ టైటిల్ మనదే!... ఫైనల్లో సాయిరాజ్, చిరాగ్ జోడి గెలుపు!
- థామస్ కప్ డబుల్స్ టైటిల్‌లో భారత జోడి విక్టరీ
- ఇండోనేషియా జోడిపై సాయిరాజ్, చిరాగ్ జోడి గెలుపు
- భారత్ ఖాతాలో తొలి ధామస్ కప్ డబుల్స్ టైటిల్
థామస్ కప్ చరిత్రలో తొలి సారి ఫైనల్ చేరిన భారత జోడిగా ఇప్పటికే సాయిరాజ్, చిరాగ్‌ల జోడీ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్‌లో వీరు పోటీ పడాల్సిన ఇండోనేషియా జట్టు మాత్రం అప్పటికే 14 టైటిళ్లు గెలిచి యమా స్ట్రాంగ్‌గా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఫైనల్‌లో ఏదో అద్భుతం జరిగితే గానీ భారత్‌కు టైటిల్ దక్కదన్న వాదనలు వినిపించాయి. అయితే ఈ వాదనలను పటాపంచలు చేసిన సాయిరాజ్, చిరాగ్ జోడి భారత్‌కు థామస్ కప్‌లో తొలి టైటిల్‌ను అందించారు.