థియేటర్లలోనే 'విరాటపర్వం' .. రిలీజ్ డేట్ ఖరారు!
- రానా హీరోగా రూపొందిన 'విరాటపర్వం'
- ఆయన సరసన నాయికగా నటించిన సాయిపల్లవి
- ముఖ్యమైన పాత్రల్లో నటించిన ప్రియమణి, నందిత దాస్
- జూలై 1వ తేదీన విడుదల కానున్న సినిమా
సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన 'దృశ్యం 2' .. 'నారప్ప' సినిమాలు ఓటీటీలోనే వచ్చాయి. దాంతో 'విరాటపర్వం' కూడా ఓటీటీలోనే రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు .. ఆ సినిమా తరువాత షూటింగు పూర్తిచేసుకున్న సినిమాలు కూడా విడుదలైపోయాయి. 'విరాటపర్వం' జాడలేకపోవడం అందరినీ ఆలోచనలో పడేసింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. జూలై 1వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చెప్పారు. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రియమణి .. నందిత దాస్ .. సాయిచంద్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.