వెడ్డింగ్ యానివర్సరీని కలిసి జరుపుకున్న జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.. ఫొటోలు ఇవిగో!
- తమ జీవిత భాగస్వాములతో కలిసి వేడుక జరుపుకున్న తారక్, ప్రశాంత్ నీల్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
- ప్రశాంత్ దర్శకత్వంలో తారక్ 31వ సినిమా
ఇన్స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన ఫొటోలను జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేశారు. 'సరికొత్త ప్రారంభం' అంటూ ఎన్టీఆర్ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరోవైపు తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోంది. ఇది తారక్ కు 31వ సినిమా కావడం గమనార్హం. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే చిత్రం ఒక రేంజ్ లో ఉంటుందని, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని అభిమానులు అప్పుడే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు.
