నాకు ఈ భాషే కావాలంటే.. తిండి కూడా దొరకదు: సుహాసిని
- సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న హిందీ లాంగ్వేజ్ వార్
- హిందీ నేర్చుకోవాలన్న సుహాసిని
- హిందీ సినిమాలు చేసుకోవాలంటూ సుహాసినిని ట్రోల్ చేస్తున్న తమిళ యువత
తమ ఇంట్లో పని చేసేవాళ్లలో తెలుగు మాట్లాడేవాళ్లతో పాటు హిందీ మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారని సుహాసిని చెప్పారు. ఈ భాషే కావాలని భీష్మించుకుంటే మనకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తమిళ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా సుహాసినిని ట్రోల్ చేస్తున్నారు. హిందీ మాట్లాడాలనిపిస్తే హిందీ సినిమాలే చేసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు.