మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడంలేదు: జీవిత
- శేఖర్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటన
- పోస్టర్ విడుదల చేసిన జీవిత
- ఇటీవల జీవిత, రాజశేఖర్ పై వివాదం
- వివరణ ఇచ్చిన జీవిత
- సోషల్ మీడియా ప్రచారంపై ఆవేదన
"ఒకప్పుడు `మా` ఎలక్షన్ సందర్భంగా మా కుటుంబం పేరు బయటకు వచ్చింది. ఇలా పలు సందర్భాల్లో మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడంలేదు. మా మీద కొందరు పనిగట్టుకుని తప్పుడు భావన కలిగేలా సోషల్ మీడియాలో థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. అదేవిధంగా నిహారిక, మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి కూడా చాలా దారుణమైన వార్తలను ట్రోల్ చేస్తున్నారు. మా కుమార్తెల గురించి రకరకాల వార్తలను రాశారు. అవన్నీ మానసికంగా ఎంతో బాధకు గురిచేస్తున్నాయి" అని వాపోయారు.
అయితే, తాను పాజిటివ్ థింకింగ్‌తో ముందుకు పోతానని, నచ్చని వారెవరో వెనక నుండి ఇలాంటి పనులు చేస్తుంటారని ఆమె చెప్పారు.
వివాదంపై 'శేఖర్’ నిర్మాత శ్రీనివాస్ ఏమన్నారంటే...