జగన్ డబ్బాలు కొట్టుకుంటున్నారు: తులసిరెడ్డి
- జగన్ పాలనలో సంక్షేమం సంక్షోభంలో పడిందన్న తులసిరెడ్డి
- సున్నా వడ్డీ పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే అమలు చేశామని వెల్లడి
- జగన్ కు చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన బంగారు తల్లి, అమ్మ హస్తం వంటి పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేయడం లేదని తులసిరెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఒక్కో సంఘానికి రూ. 5 లక్షల వరకు సున్నా వడ్డీ పథకం వర్తించేదని... జగన్ పాలనలో రూ. 3 లక్షలకు కుదించారని విమర్శించారు. సంక్షేమం పట్ల జగన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.