రవితేజ సరసన రెండో నాయిక ఈ బ్యూటీనే!
- 'టైగర్' నాగేశ్వరరావు'గా రవితేజ
- ఒక కథానాయికగా నుపుర్ సనన్
- మరో కథానాయికగా గాయత్రి భరద్వాజ్
- రేపు జరగనున్న పూజా కార్యక్రమాలు
ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు వుంటారు. ఒక కథానాయికగా నుపుర్ సనన్ ను ఎంపిక చేసిన టీమ్, తాజాగా గాయత్రి భరద్వాజ్ ను కూడా తీసుకున్నట్టుగా ప్రకటిస్తూ ఆమె ఫొటోను వదిలారు. ఈ ఢిల్లీ బ్యూటీ అందాల పోటీల్లో పలుమార్లు విజయాలను సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమవుతోంది.
ఇటీవల రవితేజ వరుసగా ఇద్దరు హీరోయిన్ల కథలతో సందడి చేస్తున్నాడు. 'ఖిలాడి'లో మీనాక్షి చౌదరి - డింపుల్ హయతితో ఆడిపాడిన ఆయన, 'రామారావు ఆన్ డ్యూటీ'లో దివ్యాన్ష కౌశిక్ - రజీషా విజయన్ తో కలిసి పలకరించనున్నాడు. ఇక 'టైగర్ నాగేశ్వరరావు'తోను ఆయన అదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు.