బాల్క సుమన్ ఓ బానిస: టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి
- రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి బాల్క సుమన్ కు లేదు
- బాల్క సుమన్ బెదిరిస్తే బెదిరే వాళ్లం కాదు
- నీ నియోజకవర్గం గురించి మాట్లాడదామా? అంటూ ప్రశ్నించిన సుధీర్
కేసీఆర్ కుటుంబానికి బాల్క సుమన్ ఒక బానిస అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాల్క సుమన్ నీ సొంత నియోజకవర్గంపై మాట్లాడదామా? అని సవాల్ విసిరారు. డ్రగ్స్, విద్యుత్, సంక్షేమ పథకాలపై తాము ఇప్పటికే సవాల్ విసిరామని... అయితే ఇంతవరకు సమాధానం రాలేదని ఎద్దేవా చేశారు.