విజయ్ దేవరకొండ సరసన సమంత?
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'శాకుంతలం'
- షూటింగు దశలో 'యశోద'
- శివ నిర్వాణకి గ్రీన్ సిగ్నల్ అంటూ టాక్
- గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'మజిలీ'
ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వానీని తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో, సమంతను తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. చైతూ - సమంత కాంబినేషన్లో 'మజిలీ' వంటి హిట్ ఇచ్చింది శివ నిర్వాణనే. అందువలన వెంటనే సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ను తెరపై గొప్పగా ఆవిష్కరించగలడనే పేరున్న శివ నిర్వాణ, త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. 'యశోద' తరువాత తెలుగులో సమంత చేస్తున్న సినిమా ఇది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత చేసిన 'శాకుంతలం' ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.