ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తున్న 'బంగార్రాజు'
- జనవరి 14న వచ్చిన 'బంగార్రాజు'
- సంక్రాంతి విజేతగా నిలిచిన సినిమా
- అదనపు బలంగా నిలిచిన అనూప్ సంగీతం
- ఈ నెల 18 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్
రీసెంట్ గా ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ దిశగా పరుగులు తీస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి జీ 5లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లో ఈ సినిమాను చూడలేకపోయినవారికి .. మళ్లీ చూడాలనుకున్న వారికి ఇది ఉత్సాహాన్ని ఇచ్చే వార్తనే.
అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. గ్రామీణ నేపథ్యానికి తగిన విధంగా .. రొమాంటిక్ పాళ్లకి తగినట్టుగా ఆయన అందించిన బాణీలు జనంలోకి బాగా వెళ్లాయి. ఈ సినిమా విజయంలో పాటలు కీలకమైన పాత్రను పోషించాయి.