త్రివిక్రమ్ ను బెదిరించిన మాట నిజమే: నటుడు సంపత్ రాజ్
- విలన్ గా సంపత్ రాజ్ కి మంచి క్రేజ్
- త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం
- పెద్ద పాత్ర ఇస్తానని మాట ఇచ్చారు
- ఇవ్వకపోతే ఊరుకోనన్న సంపత్
"తెలుగులో నా అభిమాన దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు .. ఆయన డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలలో చేయాలని నాకు ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఒకసారి ఒక సినిమాలో చిన్న రోల్ ఇచ్చారు. నా పాత్ర ఏమిటని కూడా అడక్కుండా నేను ఓకే అనేశాను. మరోసారి పెద్ద రోల్ ఇస్తానని చెప్పిన ఆయన, ఆ తరువాత చాలా సినిమాలు చేశారుగానీ నన్ను మాత్రం తీసుకోలేదు.
ఈ సారి మాత్రం నన్ను తీసుకోకుండా సినిమా తీయడానికి ప్రయత్నిస్తే మాత్రం, లొకేషన్ కి వచ్చి కెమెరా తీసుకుని వెళ్లిపోతాను అని ఆయనతోనే చెప్పాను. ఆయన ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నట్టుగా తెలిసింది. ఒకటి రెండు వారాల్లో వెళ్లి ఆ సినిమాలో వేషం అడుగుతాను .. ఇవ్వకపోతే నా మాటను నేను నిలబెట్టుకుంటాను" అంటూ నవ్వేశారు.