సైఫ్, కరీనా ప్రేమకథ... మధ్యలో అక్షయ్ కుమార్ జోక్యం!
- బాలీవుడ్ లో రొమాంటిక్ జోడీగా సైఫ్, కరీనా
- ప్రేమ పెళ్లి చేసుకున్న సైఫ్, కరీనా
- గతంలో తషాన్ చిత్రంలో నటించిన వైనం
- కరీనాతో జాగ్రత్త అంటూ అక్షయ్ హెచ్చరిక
ఇక అసలు విషయానికొస్తే... పదేళ్లుగా వీరి దాంపత్య జీవనం సాఫీగా సాగుతోంది. వీరికి తైమూర్, జహంగీర్ అనే పిల్లలున్నారు. ఇటీవల కరీనా... తన స్నేహితురాలు ట్వింకిల్ ఖన్నాతో చిట్ చాట్ సందర్భంగా ఆసక్తికర అంశం వెల్లడించింది.
సైఫ్ తో కలిసి తాను 'తషాన్' అనే చిత్రంలో నటించానని, అందులో అక్షయ్ కుమార్ తమ సహనటుడు అని కరీనా తెలిపింది. అయితే సెట్స్ పై తనతో సైఫ్ ఎంతో సన్నిహితంగా మెలుగుతుండడం గమనించి అక్షయ్ కుమార్... సైఫ్ ను హెచ్చరించాడని కరీనా వెల్లడించింది. "బేబో (కరీనా ముద్దుపేరు)తో జాగ్రత్త... ఆమె అసలే మంచిది కాదు... వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అంతకంటే ప్రమాదకారులు" అని చెప్పాడని వివరించింది.
ఇంతలో ట్వింకిల్ ఖన్నా అందుకుని తాను కూడా ఆ సినిమా సెట్స్ పై ఉన్నానని తెలిపింది. కరీనా, సైఫ్ మధ్య ఏదో జరుగుతోందని తనకు కూడా అనిపించిందని పేర్కొంది. కాగా, ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ కుమార్ ప్రేమ వివాహం చేసుకోవడం తెలిసిందే.