అవినాశ్ రెడ్డి, శంకర్ రెడ్డిలు నార్కో అనాలసిస్ పరీక్షకు అంగీకరించాలి: టీడీపీ నేత బీటెక్ రవి
- వివేకా కుటుంబానికి అన్యాయం జరుగుతోంది
- నిందితుడు శంకర్ రెడ్డి ఇంకా ఆసుపత్రిలో ఉన్నారు
- దీంతో జగన్ పై కూడా అనుమానాలు కలుగుతున్నాయి
ఈ హత్య కేసులో వైసీపీ ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిలు నార్కో అనాలసిస్ పరీక్షలకు ఒప్పుకోవాలని... లేని పక్షంలో హత్యతో వారికి సంబంధం ఉన్నట్టు అనుమానించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కేసులో నిందితుడు శంకర్ రెడ్డి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారని... దీంతో జగన్ పై కూడా అనుమానాలు వస్తున్నాయని చెప్పారు.