ఒవైసీని అరెస్ట్ చేయండి.. రూ. 22 లక్షలు అందుకోండి: ప్రకటించిన హిందూ సంఘాలు
- గురుగ్రామ్‌లో హిందూ సంఘాల ర్యాలీ
- కాళీ చరణ్ మహరాజ్‌ను విడుదల చేయాలని డిమాండ్
- నమాజ్‌కు వ్యతిరేకంగా, గాడ్సేను పొగుడుతూ నినాదాలు
డిప్యూటీ కమిషనర్ ఇంటి నుంచి కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నమాజ్‌ను వ్యతిరేకిస్తూ, నాథూరాం గాడ్సేను పొగుడుతూ నినాదాలు చేశారు. ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ.. అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేసిన వారికి రూ. 22 లక్షల నజరానా ఇస్తామని ప్రకటించారు. కాగా, ఈ ఆందోళనకు సంయుక్త హిందూ సంఘర్ష్ సమితికి చెందిన కుల్‌భూషణ్ భరద్వాజ్ నేతృత్వం వహించారు.