విడిపోయిన 'బిగ్ బాస్' జంట దీప్తి సునయన, షణ్ముఖ్
- పరస్పర అంగీకారంతో విడిపోయామన్న సునయన
- ఇద్దరి దారులు వేరనే విషయం తెలుసుకున్నామని వ్యాఖ్య
- తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని విన్నపం
తాను, షణ్ముఖ్ ఇద్దరం మాట్లాడుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నామని సునయన తెలిపింది. ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయామని చెప్పింది. గత ఐదేళ్లుగా తాము సంతోషంగా ఉన్నామని తెలిపింది. చివరకు మీరు కోరుకున్నట్టే నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. కలిసి ఉండటానికి ఇద్దరం ఎంతో ప్రయత్నించామని, అయితే జీవితానికి ఏవి అవసరమో వాటిని విస్మరించామని తెలిపింది.
తమ ఇద్దరి దారులు వేరనే విషయాన్ని తెలుసుకున్నామని... అందుకే ఇక్కడితోనే ఆగిపోకుండా ముందుకు సాగాలని భావించామని చెప్పింది. తమ బ్రేకప్ సోషల్ మీడియాలో కనిపించినంత ఈజీ కాదని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఇద్దరి ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నామని చెప్పింది.