విజయ్ దేవరకొండతో సుక్కూ ప్రాజెక్టు లేనట్టేనా?
- 'పుష్ప'తో హిట్ కొట్టిన సుకుమార్
- 'పుష్ప 2' షూట్ కి సన్నాహాలు
- నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ తో
- గతంలో 'రంగస్థలం'తో లభించిన హిట్
కానీ ఇక ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 'పుష్ప 2' తరువాత విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా ఉండొచ్చని అంతా అనుకున్నారు. 'లైగర్' తరువాత విజయ్ దేవరకొండ ఈ సినిమా సెట్స్ పైకే వెళతాడని ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు సుకుమార్ 'పుష్ప 2' తరువాత చరణ్ తో చేయనున్నట్టు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'రంగస్థలం' వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా విజయ్ దేవరకొండతో సినిమాను గురించిన ప్రస్తావన లేకవడంతో, ఈ సినిమా ఇక లేనట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.