వరి కల్లంలో కూలి పని చేసి రూ.100 సంపాదించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్
- ప్రజాసేవ కోసం ఉద్యోగం వదులుకున్న ప్రవీణ్ కుమార్
- ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆసక్తి
- తాజాగా నల్గొండ జిల్లాలో పర్యటన
- వడ్ల బస్తాలు మోసిన వైనం
తాజాగా నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో పర్యటించారు. అక్కడ ఓ వరి కల్లంలో కూలి పనిచేశారు. వడ్ల బస్తాలు మోసి రూ.100 సంపాదించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్ అంటూ స్పందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు.