ఫ్లాప్ ను పట్టించుకోని నిర్మాతలు .. రజనీతో మరో సినిమా!
- నిరాశ పరిచిన 'అన్నాత్తే'
- తెలుగులో 'పెద్దన్న' పరిస్థితి అదే
- అయినా వెనుకాడని సన్ పిక్చర్స్
- పాండిరాజ్ తో రజనీకాంత్
తమిళంతో పాటే తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 4వ తేదీన విడుదల చేశారు. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాను ఇక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కోలీవుడ్లో కూడా ఈ సినిమాకి అంతగా ఆదరణ లభించలేదు. దాంతో ఈ సినిమా భారీగానే నష్టాలను తెచ్చిపెట్టింది.
ఈ నేపథ్యంలో శివతో మరో సినిమా చేస్తానని రజనీ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సన్ పిక్చర్స్ వారు తమ తదుపరి సినిమాను కూడా రజనీతోనే చేయాలని నిర్ణయించుకోవడం మరింత విస్మయానికి గురిచేసే విషయం. ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.