మాంఛి జోరుమీదున్న 'భీమ్లా నాయక్'!
- పవన్ సరసన నిత్యామీనన్
- రానా జోడీగా సంయుక్త మీనన్
- ఈ నెల 15వ తేదీన సెకండ్ సింగిల్
- జనవరి 12వ తేదీన సినిమా విడుదల
పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించింది. ఆమె పోర్షన్ షూటింగును కూడా పూర్తి చేశారు. ఈ రోల్ చేయడానికి ఆమె పారితోషికంగా 80 లక్షలకి పైగా తీనుకున్నట్టు చెబుతున్నారు. ఇక రానా జోడీ ఎంపిక విషయంలోనే కాస్త ఆలస్యం జరిగింది. ఆయన సరసన సంయుక్త మీనన్ ను తీసుకున్నారు. ఆ విషయాన్ని ఆమె కూడా ధ్రువీకరించింది.
ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్లు ఎక్కువగా చిత్రీకరించవలసి ఉందట. ఈ నెలాఖరుతో షూటింగు పార్టును పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ రికార్డు స్థాయిలో వ్యూస్ ను .. లైక్స్ ను రాబట్టుకుంది. ఈ నెల 15వ తేదీన సెకండ్ సింగిల్ ను వదలనున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.