పాటల చిత్రీకరణలో 'అఖండ'
- ముగింపు దశలో 'అఖండ'
- గోవాలో పాట చిత్రీకరణ
- నెలాఖరులో మరో పాట షూటింగ్
- దీపావళికి రిలీజ్ చేసే ఆలోచన
ఈ రెండు పాటలతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, పూర్ణ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాతో బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.