రేపే 'సీటీమార్' ప్రీ రిలీజ్ ఈవెంట్!
- గోపీచంద్ నుంచి 'సీటీమార్'
- సంపత్ నందితో రెండో సినిమా
- కబడ్డీ నేపథ్యంలో సాగే కథ
- కీలక పాత్రలో భూమిక
హైదరాబాదు .. జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. కబడ్డీ నేపథ్యంలో నడిచే ఈ కథలో, గోపీచంద్ సరసన నాయికగా తమన్నా అలరించనుంది.
'గౌతమ్ నంద' తరువాత గోపీచంద్ - సంపత్ నంది కలిసి చేసిన సినిమా ఇది. మణిశర్మ సంగీతానికి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. తరుణ్ ఆరోరా .. రెహ్మాన్ .. రావు రమేశ్ .. భూమిక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను చేశారు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్ కి ఈ సినిమా ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి.