పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రియమణి!
- చారిత్రక నేపథ్యంలో 'వీరమల్లు'
- మలయాళ రీమేక్ గా 'భీమ్లా నాయక్'
- లైన్లో హరీశ్ శంకర్ ప్రాజెక్టు
- కీలకమైన పాత్రలో ప్రియమణి
ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. ఇక ఒక కీలకమైన పాత్ర కోసం ప్రియమణిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రియమణి ముఖ్యమైన పాత్రను పోషించిన 'నారప్ప' ఇటీవలే ప్రేక్షకులను పలకరించింది. ఇక రానా 'విరాటపర్వం'లోను ఆమె ఒక కీలకమైన పాత్రను చేసింది. అలాగే పవన్ సినిమాలోను ప్రాధాన్యత కలిగిన ఒక పాత్రను చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు.