నాగ్ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రీ లుక్!
- నాగ్ నుంచి మరో యాక్షన్ మూవీ
- 'గరుడ వేగ' తరహాలో ప్రవీణ్ సత్తారు టేకింగ్
- కథానాయికగా కాజల్
- 29వ తేదీన ఇంట్రెస్టింగ్ అప్డేట్
ఈ నెల 29వ తేదీన ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ ఉంటుందనే విషయాన్ని ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. బహుశా అప్పుడు టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను వదిలే అవకాశం ఉంది. ఈ సినిమాలో నాగార్జున కొత్త లుక్ తో కనిపించనున్నారు. 'గరుడ వేగ' తరువాత ప్రవీణ్ సత్తారు చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ మధ్య కాలంలో నాగార్జున యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. అందుకు నిదర్శనంగా 'ఆఫీసర్' .. 'వైల్డ్ డాగ్' .. సినిమాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా అదే తరహాలో నిర్మితమవుతోంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.