విడుదలైన కొన్ని గంటల్లోనే ట్విట్టర్ లో రికార్డు సృష్టించిన 'భోళా శంకర్'
- నేడు చిరంజీవి పుట్టినరోజు
- చిరు కొత్త చిత్రం టైటిల్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు
- కొద్దిసమయంలోనే మిలియన్ వ్యూస్ పొందిన వీడియో
- ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ వెల్లడి
తమిళంలో అజిత్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్టయిన వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కుతోంది. వేదాళంలో అజిత్, లక్ష్మీమీనన్ అన్నాచెల్లెళ్ల పాత్రల్లో నటించగా, తెలుగులో చిరంజీవి, కీర్తి సురేశ్ ఆ పాత్రల్లో కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.