దసరాకి ముందుగానే 'అఖండ' రిలీజ్?
- ముగింపు దశలో 'అఖండ'
- విలన్ పాత్రలో శ్రీకాంత్
- త్వరలో షూటింగు పార్టు పూర్తి
- వినాయక చవితి తరువాతనే రిలీజ్
నిజానికి ఈ సినిమాను గడిచిన మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వలన కలిగిన అంతరాయం వలన కుదరలేదు. 'ఆర్ ఆర్ ఆర్' రావడం ఆలస్యమైతే దసరా బరిలోకి దిగాలని అనుకున్నారు. ఆ దిశగానే సన్నాహాలు చేసుకుంటూ వచ్చారు. అయితే దసరాకి 'ఆర్ ఆర్ ఆర్' రావడం ఖరారు కావడంతో ఆలోచనలో పడ్డారు.
పోనీ 'వినాయక చవితి' కానుకగా థియేటర్లలో దింపుదామా అంటే, అప్పటికి పనులు పూర్తికావు. అందువలన ఈ సినిమాను సెప్టెంబర్ చివరివారంలో గానీ .. అక్టోబర్ మొదటివారంలోగాని విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయం అధికారికంగా బయటికి రావలసి ఉంది. ఇక దాదాపు ఇదే ఆలోచనలో 'ఆచార్య' టీమ్ ఉన్నట్టుగా వార్తలు వస్తుండటం ఇక్కడ కొసమెరుపు.