నిఖిల్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్!
- భారీ విజయాన్ని సాధించిన 'కార్తికేయ'
- షూటింగు దశలో సీక్వెల్
- వివిధ రాష్ట్రాల్లో జరిగిన షూటింగ్
- విదేశాలకు వెళ్లేందుకు సన్నాహాలు
- కీలక పాత్రలో అనుపమ్ ఖేర్
చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయంతో ముడిపడిన కథతో మొదటిభాగం సాగితే, ద్వాపరయుగానికి సంబంధించిన ఒక రహస్యంతో ముడిపడి రెండవభాగం నడుస్తుందని అంటున్నారు. గుజరాత్ .. ఉత్తరాఖండ్ .. హిమాచల్ ప్రదేశ్ .. రాజస్థాన్ లోని లొకేషన్స్ లో కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ ను యూరప్ దేశాలలో ప్లాన్ చేశారట. అందుకు అవసరమైన సన్నాహాలను చేసుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం.