సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మరో తమిళ సినిమాలో రష్మిక
- దీపావళికి రజనీకాంత్ సినిమా
- షూటింగ్ మొదలెట్టిన నాని
* తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' చిత్రం విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇందులో హీరోయిన్లు నయనతార, కీర్తి సురేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
* నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్యామ్ సింగ రాయ్' చిత్రం చివరి షెడ్యూలు షూటింగు నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు.