రవితేజ 68వ సినిమా షూటింగ్ ప్రారంభం!
- 'క్రాక్'తో తిరుగులేని హిట్
- 'ఖిలాడి' షూటింగు పూర్తి
- కొత్త దర్శకుడితో సినిమా మొదలు
- కథానాయికగా దివ్యాన్ష కౌశిక్
ఇటీవలే శరత్ మండవ అనే కొత్త దర్శకుడికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ వెంటనే పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగును ఈ రోజున మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ఒక పోస్టర్ ను వదిలారు. రవితేజ ఈ సినిమాను కూడా చాలా వేగంగా పూర్తిచేయనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా దివ్యాన్ష కౌశిక్ సందడి చేయనుంది. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.