'అఖండ' క్లైమాక్స్ పనుల్లో బోయపాటి!
- బోయపాటి నుంచి రానున్న 'అఖండ'
- డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న బాలకృష్ణ
- ప్రతినాయకుడిగా శ్రీకాంత్
- ముఖ్య పాత్రలో పూర్ణ
ఈ సినిమాలో బాలకృష్ణ రైతుగా .. అఘోరగా డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఈ రెండు లుక్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణను ఎలా చూపించాలో .. ఆయన అభిమానులు ఆయన సినిమాల నుంచి ఆశించేదేమిటో బోయపాటికి బాగా తెలుసు. అందువలన క్లైమాక్స్ ను ఆయన ఒక రేంజ్ లో ప్లాన్ చేశాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, పూర్ణ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఇక ప్రతినాయకుడిగా శ్రీకాంత్ చేస్తున్న సంగతి తెలిసిందే.