మళ్లీ సెట్స్ పైకి వెళుతున్న 'మేజర్'
- అడివి శేష్ నుంచి 'మేజర్'
- తెలుగు తెరకి సయీ మంజ్రేకర్ పరిచయం
- కీలకమైన పాత్రలో రేవతి
- వచ్చేనెలలో తదుపరి షెడ్యూల్
అలాంటి ఈ సినిమా మళ్లీ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోందట. జులైలో ఈ సినిమా షూటింగును మళ్లీ మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఎదురుచూస్తున్నాము అని తన ట్విట్టర్లో అడివి శేష్ రాసుకొచ్చాడు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ్ల ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ .. రేవతి కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే బలమైన నమ్మకంతో అడివి శేష్ ఉన్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమాకి ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు.