బోయపాటిని రంగంలోకి దిగమన్న బాలయ్య!
- బోయపాటితో బాలయ్య 'అఖండ'
- చిత్రీకరణ పరంగా ముగింపు దశలో
- వచ్చేనెలలో మళ్లీ సెట్స్ పైకి
- దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్
బాలకృష్ణ తన సినిమాల విషయంలో ఎంతమాత్రం ఆలస్యం కానివ్వరు. అసలు ఈ సినిమాను ఎన్టీఆట్ జయంతికే విడుదల చేయాలని ఆయన అనుకున్నారు. కానీ కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన కుదరలేదు. ఇప్పటికే ఆలస్యం అయిన కారణంగా ఇక సాధ్యమైనంత త్వరగా షూటింగును పూర్తిచేయాలని ఆయన బోయపాటితో అన్నారట. ప్రస్తుతం బోయపాటి అందుకు సంబంధించిన పనుల్లోనే ఉన్నాడనీ, జులై మొదటివారంలో సెట్స్ పైకి వెళతారని చెప్పుకుంటున్నారు. బాలయ్య స్పీడ్ చూస్తుంటే, ఈ సినిమాను దసరా బరిలో దింపేలానే ఉన్నారు మరి!