బాలకృష్ణ బర్త్ డే నాడే 'అఖండ' సింగిల్!
- బోయపాటి నుంచి రానున్న 'అఖండ'
- సంగీత దర్శకుడిగా తమన్
- జూన్ 10 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
- దసరాకి సినిమా విడుదల
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా, జూన్ 10వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన స్వరపరిచిన బాణీలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.