పాన్ ఇండియా స్థాయిలోనే త్రివిక్రమ్ మూవీ!
- మహేశ్ తో త్రివిక్రమ్ మూవీ
- పరిశీలనలో 'పార్థు' టైటిల్
- ఇద్దరు కథానాయికలకు ఛాన్స్
- త్వరలోనే సెట్స్ పైకి
ఈ సినిమాకి 'పార్థు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉందట. ఒక కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో కథానాయికగా జాన్వీ కపూర్ ను తీసుకోవటానికి గట్టిగానే ట్రై చేస్తున్నారట. ఒకవేళ కుదరకపోతే మాత్రం రెండవ కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే త్రివిక్రమ్ ప్రాజెక్టు పైకి రానున్నాడు.