కమల్ తో తలపడే విలన్ విజయ్ సేతుపతినే!
- స్టార్ హీరోగా క్రేజ్
- స్టార్ విలన్ గానూ ఇమేజ్
- 'విక్రమ్' సినిమాలో విలన్ గా
- దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్
అలాంటి విజయ్ సేతుపతి .. కమల్ 'విక్రమ్' సినిమాలో ప్రతినాయకుడిగా చేస్తున్నాడు. తాజాగా ఆయన ఈ ప్రాజెక్టుపై సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది కమల్ సొంత బ్యానర్లో నిర్మితమవుతోంది. కమల్ తనని ఎదుర్కునే పాత్రకి విజయ్ సేతుపతిని ఎంపిక చేశారంటే, నటుడిగా ఆయన ఏ స్థాయికి వెళ్లాడనేది అర్థం చేసుకోవచ్చు. కార్తి హీరోగా చేసిన 'ఖైదీ' .. విజయ్ కథానాయకుడిగా చేసిన 'మాస్టర్' సినిమాకి దర్శకత్వం వహించిన లోకేశ్ కనగరాజ్, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.