బాలయ్య భార్య పాత్రలో పూర్ణ!
- విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ
- ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పూర్ణ
- దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్
ఈ సినిమాలో పూర్ణ పాత్ర నిడివి చిన్నదే అయినా, బాలకృష్ణ భార్య పాత్ర కావడం వలన .. ఆయనతో తొలిసారిగా వచ్చిన అవకాశం కావడం వలన ఆమె అంగీకరించిందని అంటున్నారు. కథలో ఒక కీలకమైన మలుపుగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో పూర్ణ కనిపిస్తుందట. సెకండాఫ్ లో వచ్చే పూర్ణ పాత్ర చాలా బాగుంటుందనీ .. ఆమెకి మంచి పేరు తెస్తుందని చెబుతున్నారు.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో, విలన్ గా శ్రీకాంత్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.