మలయాళ బ్యూటీ మళ్లీ బిజీ కానుందా?
- పలు సినిమాలలో నటించిన మమతా మోహన్ దాస్
- సింగర్ గాను మంచి మార్కులు కొట్టేసింది
- మలయాళ సినిమాలతో బిజీ
- తెలుగు నుంచి కూడా వెళుతున్న అవకాశాలు
ఆ తర్వాత దురదృష్టవశాత్తు మమతా మోహన్ దాస్ కేన్సర్ బారిన పడింది. ఆ తరువాత మనోధైర్యంతో ఆమె ఆ వ్యాధిని జయించింది. అప్పటి నుంచి ఆమె వరుసగా మలయాళ సినిమాలతో బిజీ అయింది. తాజాగా మలయాళంలో ఆమె 'లాల్ భాగ్' అనే సినిమా చేసింది. మలయాళంతో పాటు తమిళ .. తెలుగు భాషల్లోను ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి కూడా మమతా మోహన్ దాస్ కి అవకాశాలు వెళుతున్నాయట. కీలకమైన పాత్రలకి గాను కొన్ని తెలుగు ప్రాజెక్టులపై ఆమె సైన్ చేయనుందని అంటున్నారు. తెలుగులో మమతా మోహన్ దాస్ మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.