ప్రేమకథా చిత్రంలో అనుష్క సరసన నవీన్ పోలిశెట్టి!
- 'జాతిరత్నాలు'తో నవీన్ పోలిశెట్టికి ఆఫర్లు
- మహేశ్ దర్శకత్వంలో అనుష్క సినిమా
- 40 ఏళ్ల మహిళ, 25 ఏళ్ల కుర్రాడి మధ్య ప్రేమకథ
'నిశ్శబ్దం' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు ఓ వెరైటీ ప్రేమకథ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. గతంలో 'రారా కృష్ణయ్య' చిత్రాన్ని రూపొందించిన మహేశ్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఈ చిత్రంలో హీరోగా తాజాగా నవీన్ పోలిశెట్టిని ఎంపిక చేసినట్టు సమాచారం. నలభై ఏళ్ల మహిళ.. పాతికేళ్ల కుర్రాడి మధ్య ప్రేమకథగా ఇది తెరకెక్కుతుందట. దీనిని దృష్టిలో పెట్టుకునే నవీన్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది.