రవితేజ సరసన 'గ్యాంగ్ లీడర్' భామ
- 'గ్యాంగ్ లీడర్'తో టాలీవుడ్ కి పరిచయం
- ప్రస్తుతం 'శ్రీకారం' సినిమాలో ప్రియాంక
- త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ
- 'ఖిలాడి' తర్వాత మొదలయ్యే చిత్రం
తాజాగా 'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఇంతకుముందు 'సినిమా చూపిస్త మావా', 'నేను లోకల్' సినిమాలతో వినోదాత్మక కథా చిత్రాల దర్శకుడిగా త్రినాథరావు పేరుతెచ్చుకున్నాడు. ఇప్పుడు రవితేజతో ఆయన ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేశాడు. ఇందులో కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.