Niharika: పెళ్లి సమయంలో చైతన్య 'ప్రేమ'కబురు.. నిహారిక కన్నీరు.. నాటి వీడియో విడుదల!
- గత నెలలో పెళ్లి
- తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసిన నిహారిక
- చైతన్య పంపిన సందేశాన్ని చదువుతూ కన్నీరు
- ముస్తాబవుతూ భావోద్వేగం
మెగా బద్రర్ నాగబాబు కూతురి పెళ్లి నెల రోజుల క్రితం రాజస్థాన్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ పెళ్లి ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అప్పట్లో తన పెళ్లి వేడుక సమయంలో నిహారిక కన్నీరు పెట్టుకున్న విషయానికి సంబంధించిన ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నిహారిక స్వయంగా షేర్ చేసింది.
పెళ్లి కూతురిగా నిహారిక ముస్తాబవుతోన్న సమయంలో ఆమెకు చైతన్య ఓ సందేశం పంపించాడు. దాన్ని చదివిన నిహారిక భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. డియర్ నిహారిక అంటూ చైతన్య అందులో తనలో ఉన్న ప్రేమను బయటపెట్టాడు. పెళ్లితో ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆమెతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నానని ఆ సందేశంలో చైతన్య చెప్పాడు.
నిహారికతో గడిపిన ప్రతి క్షణాన్ని తాను తన తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటానని అన్నాడు. 30 ఏళ్లుగా తాను ఏం కోల్పోయానో ఆమెను కలిసిన తర్వాత అర్థమైందని చెప్పాడు. తాను ఆమె కోసమే పుట్టానని, తన జీవితానికి అర్థం ఆమేనని తెలిసిందని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే నిహారిక కన్నీరు కార్చింది. కల్యాణ తిలకం దిద్దే సమయంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితను పట్టుకుని నిహారిక ఉద్వేగానికి లోనైంది. మరికొన్ని భావోద్వేగభరిత సన్నివేశాలనూ ఆమె ఇందులో చూపింది.