'కోరమీసం పోలీసోడా..' అంటున్న శ్రుతిహాసన్!
- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ 'క్రాక్'
- ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన యూనిట్
- ఈ రోజు మూడో పాట 'కోరమీసం పోలీసోడా' విడుదల
- సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమా రిలీజ్
ఈ పాటను క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన యూనిట్, ఇప్పుడీ 'పోలీసోడా' పాటను మూడో పాటగా రిలీజ్ చేసింది. తమన్ సంగీత సారథ్యంలో రమ్య బెహరా ఈ పాటను శ్రావ్యంగా ఆలపించింది. చిత్రంలో ఈ పాటను రవితేజ, శ్రుతిహాసన్ పై చిత్రీకరించారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. రవితేజ, శ్రుతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నారు.