సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తమన్నా సినిమా ఆగిపోలేదట!
- ఇటలీలో ముగిస్తున్న 'రాధే శ్యామ్'
- అల్లరి నరేశ్ 'నాంది' షూటింగ్ పూర్తి
* ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా ఇటలీలో జరుగుతోంది. ఇప్పటికే చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. రేపటితో అక్కడి షెడ్యూలు పూర్తవుతున్నట్టు తెలుస్తోంది.
* అల్లరి నరేశ్ హీరోగా రూపొందుతున్న 'నాంది' చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో దర్శకుడు సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో నరేశ్ ఒక ఎమోషనల్ క్యారెక్టర్ ను పోషించాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.