దేవరగట్టు కర్రల సమరంపై ఉత్కంఠ.. పలు మండలాల్లో 144 సెక్షన్ విధింపు
- ఈ నెల 21 నుంచి 30 వరకు బన్సీ ఉత్సవాలు
- కర్రల సమరంపై పోలీసుల నిషేధం
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు
దసరా సందర్భంగా దేవరగట్టులో జరిగే బన్సీ ఉత్సవం చాలా ప్రత్యేకమైనది. రణరంగాన్ని తలపించేలా జరిగే ఈ ఉత్సవంలో ప్రజలు ఒకరినొకరు కర్రలతో బాదుకుంటారు. ఫలితంగా చాలామంది తలలు పగిలి తీవ్ర గాయాలపాలవుతారు. ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసిముద్దవుతుంది. ఈ నెల 21 నుంచి 30 వరకు బన్సీ ఉత్సవాలను నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించినప్పటికీ అందులో భాగంగా నిర్వహించే కర్రల సమరంపై పోలీసులు ఈసారి నిషేధం విధించడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.