సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ జరిపించండి: అమిత్ షాకు రియా చక్రవర్తి విజ్ఞప్తి
- ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్
- సుశాంత్ గాళ్ ఫ్రెండ్ అంటూ రియా చక్రవర్తి గురించి ప్రచారం
- సుశాంత్ మరణానికి కారణాలేంటో తెలియాలన్న రియా
"గౌరవనీయ అమిత్ షా గారూ... నాపేరు రియా చక్రవర్తి, నేను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గాళ్ ఫ్రెండ్ ని. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హఠాన్మరణం చెంది నెల గడచిపోయింది. నాకు ప్రభుత్వంపై సంపూర్ణ నమ్మకం ఉంది. అయితే న్యాయం కోసం ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని సవినయంగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. అమిత్ షా సర్... నేను కోరుకునేది ఒక్కటే... సుశాంత్ ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి ఒత్తిళ్లు కారణమయ్యాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యమేవ జయతే" అంటూ ట్వీట్ చేశారు.