మాజీ ప్రియుడితో సినిమాకు ఇబ్బంది లేదంటున్న రష్మిక
- గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించిన రష్మిక
- ఇద్దరికీ నిశ్చితార్థం కూడా అయిన వైనం
- పెళ్లికి ముందు విడిపోయిన జంట
ఇప్పుడు తాజాగా 'కిరాక్ పార్టీ' సినిమాకు సీక్వెల్ తీసేందుకు రక్షిత్ శెట్టి రెడీ అయ్యాడు. వేరే హీరోయిన్ ను తీసుకోవాలని రక్షిత్ భావిస్తున్నాడు. అయితే నిర్మాతలు మాత్రం రష్మిక అయితేనే బాగుంటుందనే భావనలో ఉన్నారట. ఈ విషయం రష్మికకు తెలియడంతో... రక్షిత్ తో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. దీంతో, రష్మికతో కలిసి పని చేసేందుకు రక్షిత్ ను ఒప్పించే పనిలో నిర్మాతలు పడ్డారట. మరి... తన మాజీ లవర్ తో కలిసి నటించేందుకు రక్షిత్ ఒప్పుకుంటాడో? లేదో? వేచి చూడాలి.